హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బాలికల జట్టు ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బాలికల జట్టు ప్రతిభ

Published Thu, Dec 19 2024 8:12 AM | Last Updated on Thu, Dec 19 2024 8:13 AM

హ్యాం

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బాలికల జట్టు ప్రతిభ

ఏటూరునాగారం : ములుగు జిల్లాస్థాయి సీఎం కప్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలు జాకారంలో ని ర్వహించగా ఏటూరునాగారానికి చెందిన బాలి కల జట్టు ప్రధమ బహుమతి గెలుచుకుందని స్పోర్ట్స్‌ క్లబ్‌ కోచ్‌ పర్వతాల కుమార్‌ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో గెలుపొందిన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఏ టూరునాగారం బాలుర జట్టు ద్వితీయ బహుమతి గెలుపొందిందని తెలిపారు.

కొనసాగుతున్న ఇళ్ల సర్వే

వాజేడు : మండలంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొ నసాగుతోంది. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఈ సర్వే నడుస్తుండగా సర్వే జరుగుతున్న తీరును ఎంపీడీఓ విజయ, ఎంపీఓ శ్రీకాంత్‌ నాయుడు బుధవారం పరిశీలించారు. కాగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సెల్‌ఫోన్‌ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇంటి ఫొటో, స్థలం వివరాలు, యజమాని ఫొటోను సెల్‌ఫోన్‌లో యాప్‌లో పొందుపరిచారు. మండల వ్యాప్తంగా 8,158 కుటుంబాల వారు ఇళ్లకోసం దరఖాస్తులు చే సుకోగా ఆ వివరాల ప్రకారం సర్వేను పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది చేస్తున్నారు.

గణిత ఒలింపియాడ్‌లో విద్యార్థిని ప్రతిభ

గోవిందరావుపేట : ములుగు జిల్లాలో జ రిగిన గణిత ఒలింపియాడ్‌లో చల్వాయి జె డ్పీహెచ్‌ఎస్‌ విదార్థిని ప్రతిభ కనబరిచింది. మండల కేంద్రంలోని బాలుర జెడ్పీఎస్‌ ఎస్‌లో బుధవారం నిర్వహించిన గణిత ఒలింపియాడ్‌లో 10వ తరగతి చదువుతున్న డి.కారుణ్య ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో 3వ స్థానాన్ని సాధించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి మాట్లాడుతూ మా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కారుణ్య గణిత ఒలింపియాడ్‌లో జిల్లాలో 3వ స్థా నం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకచ్చింది అని అన్నారు. విద్యార్థిని కృషి, పట్టుద ల, ఉపాధ్యాయుల ప్రోత్సాహం విద్యార్థి వి జ యానికి కారణమయ్యాయన్నారు. విద్యార్థిని ఉపాధ్యాయ బృందం అభినందించారు.

పరామర్శ

కన్నాయిగూడెం: మండలంలోని బుట్టాయిగూడెంకు చెందిన జనగం సత్యం ఇటీవల మృతి చెందగా మండలంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ మండల ఇన్‌చార్జ్‌ రాంబాబు ఆధ్వర్యంలో పరామర్శించారు. నాయకులు సత్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఓదార్చి వా రికి బియ్యం, వంట సరుకులు అందించారు. సత్యం కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని రాంబాబు హామీ ఇచ్చారు. ప రామర్శించిన వారిలో జిల్లా యూత్‌ ప్రధాన కార్యదర్శి దుర్గం బైరేష్‌ ,గ్రామ శాఖ అధ్యక్షుడు సునార్కని శ్రీరాములు, సుమన్‌, మండల సీనియర్‌ నాయకులు సమ్మయ్య, ఆనందరావు, గణపతి, సమ్మయ్య, నాగేష్‌, మోహన్‌, జలేందర్‌, సంతోష్‌ తదితరులు ఉన్నారు.

హమాలీ కార్మికుల

అక్రమ అరెస్టు సరికాదు

ములుగు రూరల్‌ : సివిల్‌ సప్‌లై హమాలీ కా ర్మికులు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చార్జీలు పెంచాల ని డిమాండ్‌ మేరకు చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి హాజరు కాకుండా కార్మికులను అ రెస్టు చేయడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ముత్యాల రాజు అన్నారు. బుధవా రం హమాలీ కార్మికులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి ఒకసారి పెంచాల్సిన హమాలీ చార్జీలను నాలుగేళ్లుగా పెంచక పోవడంతో శాంతియుతంగా ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న కార్మికులను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాంబాబు, రమేశ్‌, రవి, కుమార్‌, నరేష్‌, సుమన్‌, భిక్షపతి తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
హ్యాండ్‌బాల్‌ పోటీల్లో  బాలికల జట్టు ప్రతిభ
1
1/4

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బాలికల జట్టు ప్రతిభ

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో  బాలికల జట్టు ప్రతిభ
2
2/4

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బాలికల జట్టు ప్రతిభ

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో  బాలికల జట్టు ప్రతిభ
3
3/4

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బాలికల జట్టు ప్రతిభ

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో  బాలికల జట్టు ప్రతిభ
4
4/4

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బాలికల జట్టు ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement