స్పందించేంత వరకు సమ్మె కొనసాగిస్తాం
ములుగు: ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కోయల జీవనప్రియ అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ స మీపంలో నిర్వహిస్తున్న తొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ హైమావతి చిత్రపటానికి నివాళులర్పించా రు. డీవైఎఫ్‌ఐ ములుగు జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్, సీపీఎం ములుగు మండల కార్యదర్శి ఎండీ.గఫూర్, పట్టణ కార్యదర్శి సద్దాం మద్దతుగా హా జరై మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సమగ్రశిక్ష ఉద్యోగుల డిమాండ్లతో కూడిన అంశాన్ని తీర్మానం చేసి ప్రత్యేక జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స మగ్రశిక్ష ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి సో మిడి కరుణాకర్, కోశాధికారి కుమార్ పాడ్య, ఉపాధ్యక్షులు ఎండీ ఫిరోజ్, విష్ణు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment