ఏజెన్సీ అభివృద్ధికి కృషి
వెంకటాపురం(కె): ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కొత్తగా పార్టీలో చేరిన వారు స్థానిక నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారు. ఇటీవల మండలంలో నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు, నాయకులు మన్నెం సునిల్, సాధనపల్లి శ్రీను, కొండపర్తి సీతాదేవి, గార్లపాటి రవి, పిల్లారి శెట్టి మురళి, చిట్టెం సాయి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
Comments
Please login to add a commentAdd a comment