వైద్యసిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
ములుగు: వైద్య సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకొని రాష్ట్రంలో జిల్లాను ముందువరుసలో నిలబెట్టాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ సమావేశ మందిరంలో పీహెచ్‌సీ వైద్యులు, ఆర్‌బీఎస్కే, ప్రోగ్రాం అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలో పటిష్టమైన సూక్ష్మ ప్రణాళికను తయారుచేసుకొని క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు అందించాలని సూచించారు. అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, స్క్రీనింగ్ వచ్చే నెల చివరి వారం వరకు పూర్తి చేయాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. వైద్యులు, సిబ్బందితో 100 లక్ష్యాలు చేరుకునేలా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు పవన్‌కుమార్, శ్రీకాంత్, రణధీర్, చంద్రకాంత్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు దుర్గారావు, పూర్ణ, సంపత్‌రావు, శకుంతల, సాంబయ్య, స్వరూపరాణి, సురేష్‌బాబు, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment