వనదేవతలకు మోకాళ్లపై మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్‌టీలు గురువారం వనదేవతలు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మోకాళ్లపై నిలబడి అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఆర్‌టీలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులరైజేషన్ చేయాలన్నారు. 11రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉపాధ్యాయులు మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, మహిళా ఉపాధ్యాయులకు ప్రసూతి సెలవులు ప్రకటించాలన్నారు. సీఆర్‌టీల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం అయ్యేలా చూడాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పోడెం రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరంసోత్ రాజు, వట్టం శంకర్, అరుణ్ కుమార్, శ్రీరామ్ కిషన్, దేవేందర్, వీరన్న, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కారం అయ్యేలా
దీవించాలని సీఆర్‌టీల వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment