కార్మికులను తొలగించకుండా జీఓ విడుదల చేయాలి
మంగపేట: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించకుండా ప్రభుత్వం ప్రత్యేక జీఓను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో గడ్డం భారతి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పాఠశాల వంట కార్మికుల సమావేశంలో పాల్గొన్న రవీందర్ మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం, తరగతితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికి మెస్‌చార్జీ రూ.25 చెల్లించాలన్నారు. కోడిగుడ్లు, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 22 సంవత్సరాలుగా సొంత డబ్బులు పెట్టి పాఠశాలల్లో వంటలు చేస్తూ పెట్టిన పెట్టుబడి బిల్లులు, వేతనాలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారన్నారు. వారి సర్వీసు దృష్ట్యా వారిని తొలిగించకుండా ప్రభుత్వం ప్రత్యేక జీఓ తీసుకురావాలన్నారు. అదే విధంగా వేతనాలు, డ్రెస్‌కోడ్, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్‌లను కల్పించాలన్నారు. ఈ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పరిష్కారం కాలేదని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వంటలు బంద్ చేసి సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు గడ్డం భారతి, జయమ్మ, లక్ష్మి, రాజకుమారి, తులసి, అమీణ, రమణ పాల్గొన్నారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జంపాల రవీందర్
Comments
Please login to add a commentAdd a comment