ఉద్యోగమే ఉన్నతికి మార్గం
పొరుగు దేశాల్లో బాల్య దశ నుంచే పార్ట్ టైం జాబ్‌లు చేస్తారు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడాలని.. చిన్నా చితకా పనులు చేసి సంపాదిస్తారు. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ కూడా చిన్నతనంలో ఇల్లు.. ఇల్లు తిరిగి చూయింగ్ గమ్స్, కొకాకోలా అమ్మేవాడు. ఇలా.. కోట్లు కూడబెట్టిన వాళ్లైనా.. జీవితంలో స్థిర పడ్డ వారైనా చిన్నతనం నుంచే పని చేయడం ప్రారంభించారు. డిగ్రీలు, పీజీలు చేసి సరైన ఉద్యోగం లేక ఎంతో మంది ఖాళీగా ఉంటున్నారు. ఉద్యోగమంటే బానిసత్వం కాదు. ఉన్నతికి మార్గం. చిన్నదో పెద్దదో దొరికితే ఉద్యోగం లేదంటే వ్యాపారం.. ఏదో ఒక పనిచేస్తే పేదరికాన్ని పారదోలవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment