యువత సన్మార్గంలో నడవాలి
ములుగు: యువత సన్మార్గంలో నడవాలని, జిల్లాలో మత్తు పదార్థాల నివారణఖు సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) సీహెచ్ మహేందర్‌జీ సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎకై ్సజ్, పోలీస్ శాఖ, నార్కోటిక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు విధిగా కళాశాలలు, వసతిగృహాలను సందర్శించాలని సూచించారు. తరచుగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్థులు చెడు మార్గంలో నడవకుండా చూడాలన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎవరైన డ్రగ్స్ వినియోగించినట్లు తెలిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకొని డీ అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, యువత సన్మార్గంలో నడిచేలా చూడాలన్నారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్, ఆంటీ నార్కోటిక్ డీఎస్పీ సైదులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మహేష్‌బాబు, డీఈఓ పాణిని తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాల నివారణకు చర్యలు తీసుకోవాలి
అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ
Comments
Please login to add a commentAdd a comment