బ్యాంకుల భద్రతకు పటిష్ట చర్యలు
ఏటూరునాగారం: ఖాతాదారులతో లావాదేవీలు నిర్వహిస్తున్న ఆయా బ్యాంకుల మేనేజర్లు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల కేంద్రంలోని వివిధ శాఖలకు చెందిన బ్యాంకులను ఏఎస్పీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాంకుల పరిసర ప్రాంతాలు, నగదు, బంగారం నిల్వచేసే లాకర్లు వాటి పనితీరును ఆయా బ్యాంకుల మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ బ్యాంకు మూసి ఇంటికి వెళ్లే ముందు లాకర్లు పటిష్టంగా ఉన్నాయా, సరిగా పనిచేస్తున్నాయా గమనించాలన్నారు. నగదు లావాదేవీలు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగాలని సూచించారు. రుణగ్రస్తులు తమ బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారం నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు అన్ని దిక్కులా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు నిత్యం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీస్ శాఖ అనునిత్యం తమకు అందుబాటులో ఉండి భద్రత చర్యలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. బ్యాంకుల పరిధిలో ఏమైనా భద్రత సమస్యలు తలెత్తితే పోలీసు శాఖ వారికి సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం పోలీస్ శాఖ లక్ష్యం అన్నారు. అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ ఉన్నారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
Comments
Please login to add a commentAdd a comment