హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం

Published Sun, Jan 19 2025 1:45 AM | Last Updated on Sun, Jan 19 2025 1:44 AM

హేమాచ

హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు చింతామణి జలపాతం, వనదేవత(దైతఅమ్మవారి) ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, వివిధ ప్రైవేట్‌ బస్సులు తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఈశ్వర రామానుజదాస్‌ స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం1
1/1

హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement