కాల్వపల్లి గ్రామానికి బడే ఎల్లయ్య, బతుకమ్మ కుమారుడు బడే దామోదర్ ఆలియాస్ చోక్కారావు. ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. గోవిందరావుపేటలో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావాజాలానికి ఆకర్షితుడయ్యాడు. 1977లో బడే నాగేశ్వర్‌రావు అలియాస్ ప్రభాకర్ స్ఫూర్తితో కొత్తగూడెం లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్‌జీఎస్) కమిటీలో చేరాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ దళ కమాండర్‌గా ఎదిగాడు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కొరకరాని కొయ్యగా మారాడు. ఆయన ఆధ్వర్యంలో ఎంతో మంది పార్టీలో చేరగా.. మోస్ట్‌వాంటెడ్ లిస్టులో తెలంగాణ ప్రభుత్వం రూ.20, లక్షలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.30 లక్షల రివార్డులు ప్రకటించాయి. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన మృతి చెందాడన్న వార్త కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment