గణితంలో ఘనులు
అంకెలతో ఆట.. సూత్రాలతో లెక్కల వేట
● రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు.. గుర్తింపు
● కల్వకుర్తి మండలం మార్చాల ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ రూం
● విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రాజెక్టులు
● నేడు జాతీయ గణిత దినోత్సవం
మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులే లక్ష్యం కాకుండా, నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు పలువురు ఉపాధ్యాయులు. విద్యార్థులు క్లిష్టమైన సబ్జెక్టుగా భావించే గణితాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అతి సులభంగాగణితంలో మెళకువలను నేర్పిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ లెక్కలపై ఉన్న భయాన్ని పోగొడుతున్నారు. ఆదివారం గణిత దినోత్సవం (శ్రీనివాస రామానుజన్ జయంతి) సందర్భంగా ఈ వారం సండే స్పెషల్..
– సాక్షి, నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/
గద్వాల టౌన్
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
మార్చాల జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఐశ్వర ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ పోటీలకు ఎంపికై ంది. అతి క్లిష్టమైన ‘మ్యాథమెటికల్ మోడలింగ్ అర్థమెటిక్ టు అల్గారిథమ్ వయా ఆల్జిబ్రా’ అనే అంశాన్ని ప్రదర్శించింది. క్వార్ర్‌డాటిక్ ఈక్వేషన్‌ను పరిష్కరించేందుకు ఇప్పటివరకు మూడు మెథడ్‌లు ఉండగా, ఐశ్వర్య నాలుగో మెథడ్‌ను తయారు చేయడం విశేషం. మ్యాథ్స్ విభాగంలో ప్రతిభ చూపినందుకు మార్చాల పాఠశాలకు చెందిన ఐశ్వర్యతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఎగ్జామినేషన్(ఎన్‌ఎన్‌ఎంఎస్) నుంచి ఏటా రూ.12,500 చొప్పున స్కాలర్‌షిప్‌ను అందుకుంటున్నారు. ఐదేళ్లకాలం పాటు ఈ స్కాలర్‌షిప్ విద్యార్థులకు అందుతుంది.
ఉపకార వేతనాలు పొందేలా..
పాలమూరులోని మోడల్ బేసిక్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు ఫసియొద్దీన్ ఎన్‌ఎంఎంఎస్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. ఫలితంగా గతేడాది ఏకంగా 13 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఫసియొద్దీన్ అందరి మన్ననలు పొందుతున్నారు. భవిష్యత్‌లో మరిన్ని తరగతులు నిర్వహించి విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment