‘షేక్’హ్యాండ్..!
వివరాలు 8లో u
2024లో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల, అలంపూర్ మినహా మిగిలిన 12 స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో ఏకై క పెద్ద పార్టీగా ఆవిర్భవించి పాలనా పగ్గాలు చేపట్టింది. అధికార పార్టీ అయినా.. ఈ సంవత్సరం 2024లో జరిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లోక్‌సభ ఎన్నికల్లో హస్తానికి చుక్కెదురైంది. రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒక చోట మాత్రమే విజయం సాధించింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో గెలుపు ముంగిట బోల్తా పడింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినా.. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సుమారు పది పర్యాయాలు పర్యటించినా.. ఫలితం లేకపోయింది. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా.. బీఆర్‌ఎస్ రెండు సిట్టింగ్ స్థానాలనూ చేజార్చుకుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ‘కారు’ అభ్యర్థి విజయం సాధించడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం.
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
వివరాలు 8లో u
Comments
Please login to add a commentAdd a comment