కొల్లాపూర్ రూరల్: మండలంలోని అమరగిరి, మొలచింతలపల్లి, నార్లాపూర్, ఎల్లూరు చెంచు గూడెలలో చెంచులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని చెంచు సంఘం నాయకుడు మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అమరగిరి చెంచులతో ఆయన సమావేశమై మాట్లాడారు. 20 ఏళ్లుగా చెంచులు సాగు చేసుకుంటున్న పోడు భూ ములకు పట్టాలు లేక ఫారెస్టు అధికారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొందరికి పట్టాలున్నా భూములను సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదన్నా రు. చెంచు గూడెలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాలకు సిద్ధ మవుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment