భక్తి మార్గంతో ప్రశాంత జీవనం | - | Sakshi
Sakshi News home page

భక్తి మార్గంతో ప్రశాంత జీవనం

Published Mon, Dec 30 2024 12:43 AM | Last Updated on Mon, Dec 30 2024 12:43 AM

భక్తి

భక్తి మార్గంతో ప్రశాంత జీవనం

తెలకపల్లి: భక్తిమార్గం ద్వారా ప్రశాంత జీవనం కొనసాగించవచ్చని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి అన్నారు. తెలకపల్లి మండలం పెద్దూరులోని ఆంజనేయస్వామి, శివాలయాల పునర్నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమ్మరెడ్డిపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జీయర్‌స్వామి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో మెలుగుతూ సన్మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ మామిళ్లపల్లి యాదయ్య, బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నిరంజన్‌, కొమ్ము సత్యం, ఎండీ ఫరీద్‌, కుమ్మరి బాలస్వామి, చరణ్‌ పాల్గొన్నారు.

సెమీ ఫైనల్‌కు

జిల్లా కబడ్డీ జట్టు

కల్వకుర్తిరూరల్‌: జనగామలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్స్‌ బాలుర కబడ్డీ టోర్నీలో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి సమీ ఫైనల్‌కు చేరింది. ఆదివారం సూర్యాపేట జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి యాదయ్యగౌడ్‌ తెలిపారు.

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు

వనపర్తి విద్యావిభాగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని.. నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చి కాషాయీకరణ చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పచెబుతున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని యాదవ సంఘం భవనంలో సంఘం ఉమ్మడి జిల్లా జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కె.పవన్‌కుమార్‌ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలకు విచ్ఛలవిడిగా అనుమతులివ్వడంతో పాటు మతం, కులం పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతున్నాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థినులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కేటాయించకుండా పాలన సాగిస్తోందని, విద్యారంగంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,800 కోట్లకుపైగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్లు బకాయి ఉన్నాయని.. విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోందని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేగాకుండా సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. అనంతరం పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్‌ సుల్తానా మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస వసతులు, ల్యాబ్స్‌ లేవని, తక్షణమే స్పందించి వసతులు కల్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తయ్యన్న, రాజు, వెంకటేశ్‌గౌడ్‌, యశ్వంత్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భక్తి మార్గంతో  ప్రశాంత జీవనం 
1
1/2

భక్తి మార్గంతో ప్రశాంత జీవనం

భక్తి మార్గంతో  ప్రశాంత జీవనం 
2
2/2

భక్తి మార్గంతో ప్రశాంత జీవనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement