డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీస్‌శాఖ బందోబస్తు
సాక్షి, నాగర్‌కర్నూల్:
‘నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీస్‌శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్‌పై ఫోకస్ పెట్టి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నాం. ప్రతి ఏడాది డిసెంబర్ 31, న్యూ ఇయర్ వస్తుంది. ఇదే మొదటిది, చివరిది కాదు. యువత మద్యం తాగి వాహనాలు నడపవద్దు. సురక్షితంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి.’ అని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై సోమవారం ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈసారి న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగరాదు..
జిల్లావ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, రోడ్లపైకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు. పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడైనా తాగి న్యూసెన్స్‌కు పాల్పడినట్లు సమాచారం అందిన క్షణాల్లో పోలీసులు స్పందిస్తారు. ఘటనా స్థలానికి కేవలం నిమిషాల్లోపు చేరుకుంటారు. డిసెంబర్ 31 నుంచి ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రజలు ఆనందంగా వేడుకలు నిర్వహించుకోవాలి.
ఎంజాయ్ పేరిట ఆగం కావద్దు..
డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలు ప్రతిసారి వచ్చేవే. ఎంజాయ్ పేరిట ఆగం కావద్దు. యువత ఎంజాయ్ పేరుతో మద్యం తాగి రోడ్లపైకి రావద్దు. అన్నింటికన్నా కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఙప్తి చేస్తున్నాను.
● జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు
● ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిద్దాం
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న
ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
Comments
Please login to add a commentAdd a comment