ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై దృష్టి..
●
పేరెంట్స్‌తో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తా..
ప్రతిక్షణం ప్రశాంతంగా ఉంటూ ఆనందంగా గడపాలి. చదువుపై ఫోకస్ పెట్టి ఒత్తిడికి గురికాకుండా కోర్స్ పూర్తిచేస్తాను. కొత్త ఏడాదిలో వీలైనప్పుడల్లా మా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తాను.
– కేయశ్రీ, హైదరాబాద్
పొద్దునే నిద్రలేవాలి..
కొత్త ఏడాది నుంచి రోజూ పొద్దునే 5 గంటలకల్లా నిద్రలేచి చదువు కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం త్వరగా పడుకోవడం, నిద్ర కోసం తగినంతం సమయం కేటాయించేలా చూసుకుంటా. అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమిచ్చేలా సమయాన్ని మార్చుకుంటా.
– మౌనిక, హైదరాబాద్
ఆనందంగా ఉండాలి..
కొత్త సంవత్సరంలో నా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా కలసిమెలసి ఉండాలని, ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తాను. మెడిసిన్ పూర్తిచేసేందుకు, సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు సమయపాలన పాటిస్తాను. ఏ రోజు పనులను అదే రోజు పూర్తిచేసేలా చూస్తాను. – పూజ, సంగారెడ్డి
చిన్నప్పటి నుంచి బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఇప్పటి నుంచి వైద్య వృత్తికి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై దృష్టిపెడతాను. ఎక్స్‌పర్‌మెంట్స్ పట్ల ఆసక్తి చూపిస్తాను. క్షేత్రస్థాయిలో, నిజ జీవితంలో వైద్యులకు అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను.
– అభిషయ్,
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment