సర్వే @ 75%
ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాలు ఇలా..
మున్సిపాలిటీల వారీగా..
మున్సిపాలిటీ దరఖాస్తులు పూర్తి
అయినవి
అచ్చంపేట 4,450 3,959
కల్వకుర్తి 5,205 4,522
కొల్లాపూర్ 5,757 4,760
నాగర్‌కర్నూల్ 6,940 6,284
కల్వకుర్తిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 75 శాతం మాత్రమే సర్వే పూర్తయింది. గత డిసెంబర్ 5న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే 7వ తేదీ నుంచి సర్వే చేపట్టాల్సి ఉండగా.. కొంత ఆలస్యంగా 12వ తేదీ నుంచి సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే సర్వేయర్లకు క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం.. దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సర్వే నత్తనడకన కొనసాగుతోంది.
సర్వేకు సాంకేతిక సమస్యలు..
ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ డౌన్, సిగ్నల్ సమస్య ఇబ్బందిగా మారింది. జిల్లావ్యాప్తంగా 2,33,124 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు 1,76,497 ఇళ్ల సర్వే పూర్తయ్యింది. రోజు ఒక్కో అధికారి 50 దరఖాస్తులను పరిశీలించి, మొబైల్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా.. కేవలం 20 నుంచి 30 దరఖాస్తులను మాత్రమే అతి కష్టం మీద పూర్తి చేస్తున్నారు.
కనిపించని ఆసక్తి..
క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై దరఖాస్తుదారులు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన వివరాలపై దరఖాస్తుదారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతుంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో అందరూ పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇళ్లకు తాళాలు వేస్తుండటంతో అధికారులు సర్వే చేయకుండానే తిరిగి వస్తున్నారు.
వందశాతం గగనమే..
ఇందిరమ్మ ఇళ్ల సర్వే గడువులోగా పూర్తి కావడం గగనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం నాటికి 75.71 శాతం సర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అయితే మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో వంద శాతం సర్వే పూర్తి కావడం కష్టసాధ్యమని చెప్పవచ్చు.
నేటితో ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే
జిల్లాలో 2.33 లక్షల దరఖాస్తులు
ఇప్పటి వరకు 1.76 లక్షల
ఇళ్ల సర్వే పూర్తి
మండలాల వారీగా..
అచ్చంపేట 13,218 10,088
అమ్రాబాద్ 9,680 7,563
బల్మూర్ 11,212 8,969
బిజినేపల్లి 17,847 12,517
చారకొండ 7,284 6,303
కల్వకుర్తి 1,079 8,752
కోడేరు 12,337 8,369
కొల్లాపూర్ 10,247 6,997
లింగాల 10,412 7,383
నాగర్‌కర్నూల్ 10,181 7,799
పదర 6,454 3,929
పెద్దకొత్తపల్లి 16,393 9,224
పెంట్లవెల్లి 6,386 4,663
తాడూరు 8,228 6,585
తెలకపల్లి 13,037 8,938
తిమ్మాజిపేట 10,299 8,935
ఉప్పునుంతల 9,559 8,406
ఊర్కొండ 6,297 4,520
వంగూరు 10,426 7,895
వెల్దండ 11,196 9,137
మొత్తం 2,33,124 1,76,497
ఆప్‌లైన్‌లో వివరాల నమోదు..
మొబైల్ యాప్‌లో వివరాల నమోదుకు సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ప్రభుత్వం ఆప్‌లైన్‌కు అవకాశం ఇచ్చింది. సాధ్యమైనంత వరకు సర్వేను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా గృహనిర్మాణ శాఖకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్ర భుత్వం సంగప్పను నియమించింది. సర్వే వి వరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ప్రజాపాలనలో దరఖాస్తు చేసు కోని వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసు కోవచ్చు.
– రాజవర్దన్‌రెడ్డి, గృహ నిర్మాణశాఖ ఏఈ
Comments
Please login to add a commentAdd a comment