ప్రజలు తపాలా బీమా తీసుకోవాలి
పెద్దకొత్తపల్లి: తపాలా శాఖ ద్వారా అందిస్తున్న బీమాను ప్రజలు తీసుకోవాలని వనపర్తి డివిజన్ తపాలా పర్యవేక్షకులు భూమన్న అన్నారు. శుక్రవారం మండలంలోని చంద్రకల్, జొన్నలబొగుడ తపాలా కార్యాలయాల్లో నిర్వహించిన తపాలా జీవిత బీమా మేళాకు ఆయన హాజరై మాట్లాడారు. తపాలా శాఖ ద్వారా జీవిత, ప్రమాద బీమా అందిస్తున్నామని, దీని ద్వారా రూ.599 చెల్లించి రూ.10 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 22న ఉమ్మడి జిల్లాలో తపాలా జీవిత బీమా మేళాలు ప్రతి తపాలా కార్యాలయాల్లో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా తపాలా అధికారి సృజన నాయక్, సిబ్బంది మల్లేష్, గోపాల్‌రావ్, వనజ, సమత, షమీమ్, శశి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment