విజయ మృతదేహం
సూర్యాపేట క్రైం : సూర్యాపేటలోని సద్దుల చెరువులో సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యాపేట పట్టణం పూలసెంటర్‌కు చెందిన బ్రహ్మదేవర ఈశ్వరయ్యకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్న కుమార్తె విజయ(28) ఇంటర్ వరకు చదివి మానేసింది. తండ్రి కిరాణ దుకాణం నడుపుతుండగా, తల్లి గృహిణి. విజయ కొంత కాలంగా స్థానిక హీరో షో రూంలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం ఇంట్లో నుంచి షో రూంకు వెళ్తున్నానని చెప్పి విజయ బయటికి వచ్చింది. షో రూంకు విజయ రాకపోవడంతో సిబ్బంది తండ్రి ఈశ్వరయ్యకు ఫోన్ చేశారు. విజయ షోరూంకు వస్తున్నానని చెప్పి వెళ్లిందనివారికి సమాధానం చెప్పాడు. సద్దల చెరువు నీటిలో మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని యువతి మృతేదేహం తేలియాడుతుండడంతో బండ్‌పై నుంచి వెళ్తున్న యువకులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. యువతిని బయటకు తీయిస్తుండగానే విజయ తల్లిదండ్రులు, హీరో షోరూం సిబ్బంది అకక్కడికి చేరుకున్నారు. విజయ మృతికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం విజయ మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. మృతురాలికి సోదరి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment