రామగిరి(నల్లగొండ): రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పు వెలువరించారు. మునుగోడు మండల కేంద్రానికి ఆనుకోని ఉన్న పెద్ద చెరువులో సింగారం గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా బోర్లు వేశారని 2017లో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు తహసీల్దార్, వీఆర్‌ఓ మహేశ్వర్ వెంకటయ్యలు చెరువును పరిశీలించేందుకు వెళ్లారు. సింగారం గ్రామానికి చెందిన కుంభం వెంకట్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, ఇంద్రా సేనారెడ్డి, సుజాత, వాణిలు వీఆర్‌ఓ వెంకటయ్యను కులం పేరుతో దూషించారు. తహసీల్దార్ వెంకటయ్యపై దాడి చేశారు. దీంతో వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై రాములు కేసు నమోదు చేయగా డీఎస్పీ సుధాకర్ చార్జీషీటు వేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల వాదనలతో ఏకీభవించిన ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్జు జడ్జి రోజారమణి.. అధికారుల విధులకు ఆటకం కలిగించి, కులం పేరుతో దూషించి, దాడి చేసిన ఐదుగురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.7500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు.
230 బస్తాల
రేషన్‌బియ్యం పట్టివేత
నల్లగొండ క్రైం: నల్లగొండ రూరల్, కనగల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 230 బస్తాల రేషన్ బియ్యాన్ని బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆటోను సీజ్ చేశారు. బియ్యం తరలింపులో సంబంధమున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment