స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
హాలియా: మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో స్థిరపడి ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం హాలియా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి క్యాంటీన్‌ను సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇందిరా మహిళల శక్తి కార్యక్రమంలో భాగంగా క్యాంటీన్లు, సోలార్ పవర్ జనరేషన్, ఉచిత బస్సు, మొబైల్ షిప్ అవుట్ లెట్లు, మిల్క్ పార్లర్లు ఏర్పాటు చేస్తోందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఎవరైనా సహజ మరణం పొందితే రూ.2లక్షల జీవిత బీమా, ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షలు, అంగ వైకల్యం కలిగితే రూ. 5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. సాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే మొదటిసారిగా హాలియా మున్సిపాలిటీలో స్వయం సహాయక మహిళా సంఘాలకు మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం సంతోషించదగిన విషయమన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ యడవెల్లి అనుపమనరేందర్‌రెడ్డి, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్‌కుమార్, హాలియా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, కౌన్సిలర్లు గౌనీ సుధారాణి రాజా రమేష్ యాదవ్, వెంకట్‌రెడ్డి, వెంకటయ్య, ప్రసాద్ నాయక్, నాయకులు కాకునూరి నారాయణ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గౌనీ రాజా రమేష్ యాదవ్, వెంపటి శ్రీనివాస్, కుందూరు రాజేందర్‌రెడ్డి, ఏపీఎం కళావతి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ హాలియాలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment