వరికొయ్యలను కాల్చొద్దు
ఫ డీఏఓ శ్రవణ్‌కుమార్
చిట్యాల: రైతులు.. తమ పొలాల్లోని వరి కొయ్యలను కాల్చవద్దని, అలా చేయడం ద్వారా భూమి సారవంతానికి మేలు చేసే మిత్ర పురుగులు, వానపాములు చనిపోతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) శ్రవణ్‌కుమార్ అన్నారు. చిట్యాల మండలం సుంకేనపల్లి గ్రామంలో గంగాపురం ఊషయ్యకు చెందిన కోత కోసిన వరిపొలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతకుముందు గుండ్రాంపల్లి గ్రామంలోని పీఏసీఎస్‌లో నిల్వ ఉన్న ఎరువులు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సీఈఓకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట పలువురు రైతులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment