పరిశీలన బృందాలకు సహకరించాలి
నల్లగొండ: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు వచ్చే బృందాలకు అందుబాటులో ఉంటూ సర్వేకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె.. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సర్వే బృందాలకు ప్రస్తుతం ఉన్న ఇంటి వివరాలు ఫొటోతో సహా ఇవ్వాలని కోరారు. నూతనంగా ఇల్లు నిర్మించుకునేవారైతే స్థలం వివరాలను సమర్పించాలన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల యాప్‌లో పేర్లు ఉన్న దరఖాస్తుదారుల వివరాలను ముందే ఆయా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేయనివారు ఇప్పుడు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
తెల్లరేషన్‌కార్డు ఉంటే దరఖాస్తు చేసుకోండి
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి మహాలక్ష్మి పథకం కింద రూ.500కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కావాలనుకునేవారు గతంలో దరఖాస్తు చేయని వారు మాత్రమే మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు తోపాటు, ఎల్‌పీజీ వినియోగదారుని నంబరు, ఆధార్ కార్డు వివరాలు, జిరాక్స్, ఎల్‌పీజీ గుర్తింపు ధ్రువపత్రాలతో వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
కట్టంగూర్: రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల జీపి పరిధి గంగదేవిగూడెం సమీపంలో ఉన్న కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. కంపెనీలో ఆధునిక వ్యవసాయ పనిముట్లు, నిమ్మగ్రేడింగ్, నిమ్మ ఒరుగుల తయారీ యంత్రాన్ని, కోల్డ్ స్టోరీజీని పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు సంఘటితంగా ఏర్పడి వ్యవసాయ సాగులో సాంకేతికతను ఉపయోగించటం పట్ల రైతులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎఫ్‌పీఓకు ఆర్థికసాయం అందించేందుకు తన వంతు కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్‌కుమార్, హార్టికల్చర్ అధికారి సాయిబాబా, నాబార్డు డీడీఎం వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే నంధ్యాల నర్సింహారెడ్డి, ఎఫ్‌పీఓ చైర్మన్ చెవుగోని సైదమ్మ, ఏఓ గిరిప్రసాద్, ఐఆర్‌డీఎస్ ఎన్‌జీఓ వాడేపల్లి రమేష్, ఎఫ్‌పీఓ డైరెక్టర్‌లు తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment