జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి
నల్లగొండ టూటౌన్: జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తేవాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్–2024 జిల్లా స్థాయి క్రీడా పోటీలను రెండో రోజైన మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్‌ముసాబ్, జిల్లా యుజవన, క్రీడల శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఇందిర, విమల, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరత్నం, సురేందర్‌రెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, విజయ్, నాగరాజు, షహీద్, కవిత తదితరులు పాల్గొన్నారు.
ఫ జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment