పెన్షన్.. ఉద్యోగుల హక్కు
నల్లగొండ టూటౌన్: పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని, ప్రభుత్వ బిక్ష కాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్స్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని యూటీఎఫ్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయన పెన్షనర్స్ దినోత్సవం సభకు హాజరై మాట్లాడారు. 1982 డిసెంబర్ 17న పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమన్నారు. అనంతరం పెన్షనర్లను శాలు వాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు పెన్షన్ సాధన యోధుడు డీఎస్. నకారా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూకల జగదీష్‌చంద్ర, పందిరి శ్యాంసుందర్, బాణాల పరిపూర్ణాచారి, టాప్రా పూర్వ కార్యదర్శి కె.సత్తిరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, కోశాధికారి ఎండీ.అబ్దుల్‌ఖాదర్, వనం వాణిశ్రీ, వాడపల్లి రమేష్, యానాల కృష్ణారెడ్డి, కౌసల్య, భిక్షమయ్య, పులి కృష్ణమూర్తి, జి.భిక్షమయ్య, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment