ధాన్యం రాకను అడ్డుకోవాలి
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా అడ్డుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
- 10లో
మిర్యాలగూడ పట్టణంలో..
● మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులుండగా పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్టు కింద 278 మందిగా ఉండగా మరో 37 మంది పర్మినెంట్ ఉద్యోగులున్నారు.
● వీరు ఉదయం 4గంటల నుంచి 4: 45 గంటల వరకు విధులకు హాజరుకావాల్సిన ఉండగా అదే సమయంలోనే విధులకు వచ్చి ప్రధాన అంతర్గత రహదారుల్లో చెత్త తరలించడంతో పాటు రోడ్లన్నీ ఊడ్చారు.
● శానిటరీ ఇన్‌స్పెక్టర్లు దగ్గరుండి మరీ కార్మికుల బయోమెట్రిక్‌ను పర్యవేక్షిస్తున్నారు.
● మున్సిపాలిటీలో చలి కోట్లు, మంకీ క్యాప్‌లు ఇవ్వకపోవడంతో చలిలోనే పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు.
● మహిళా పారిశుద్ధ్య కార్మికులు కాలకృత్యాలను తీర్చుకునేందుకు వసతులు లేవు.
● రాత్రి వేళల్లో విధులను నిర్వహించే కార్మికులకు మాత్రం ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.
● పారిశుద్ధ్య కార్మికులకు చీపురు కట్టలు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో అట్టాలతో చెత్తను తొలగిస్తున్నారు.
● జవాన్లు పారిశుద్ధ్య కార్మికులకు హాజరు తీసుకుని కాలనీల వారిగా వీధులను కేటాయించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని చెబుతున్నారు.
● స్వచ్ఛత ఆటో కార్మికులు, ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల్లో చెత్తను సేకరించి రోడ్లను శుభ్రం చేశారు. అయితే ఎవరికి కూడా చేతులకు తొడుగులు, రక్షణ పరికరాలు లేవు. చాలా మంది కార్మికులు చలికి తట్టుకోలేక పనులకు వెళ్లే ముందు చలి కాచుకుంటున్నారు. మరికొందరు టీ తాగి విధులకు హాజరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment