నీలగిరి పట్టణంలో ఇలా.. | - | Sakshi
Sakshi News home page

నీలగిరి పట్టణంలో ఇలా..

Published Wed, Dec 18 2024 1:45 AM | Last Updated on Wed, Dec 18 2024 1:44 AM

నీలగిరి పట్టణంలో ఇలా..

నీలగిరి పట్టణంలో ఇలా..

● నీలగిరి ప్రజలను మూడు రోజులుగా చలి చంపేస్తోంది. ఈ పరిస్థితుల్లో అత్యవసర పనులైన పారిశుద్ధ్య పనులు, ప్రధాన రోడ్లు, వాణిజ్య వ్యాపార కూడళ్లను మున్సిపల్‌ కార్మికులు రాత్రి సమయంలోనే శుభ్రం చేస్తున్నారు.

● నీలగిరి పట్టణంలో సోమవారం రాత్రి 9 గంటలకు 30 మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరై మంగళవారం ఉదయం 5 గంటలకు వరకు పనిచేశారు.

● మర్రిగూడ జంక్షన్‌ దగ్గరి నుంచి పెద్ద గడియారం సెంటర్‌ వరకు, భాస్కర్‌ టాకీస్‌ నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు, ప్రకాశం బజార్‌, రాష్ట్రపతి రోడ్డు, రామగిరి రోడ్డులో కార్మికులు చలికి వణుకుతూ డ్రెస్‌ కోడ్‌లోనే రోడ్లను ఊడ్చి చెత్తను ఎత్తిపోశారు.

● మున్ముందు చలి పెరగనున్నందున మున్సిపల్‌ కార్మికులకు స్వెటర్లు, చేతి గ్లౌజులు, బూట్లు అందించాలని కార్మికులు అభిప్రాయ పడుతున్నారు.

● బిక్షాటన చేసే వారు, మతి స్థిమితం కోల్పోయి తిరిగే వారు రాత్రంతా రోడ్ల పక్కనే నిద్రిస్తున్నారు. కొందరు రోడ్ల పక్క, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, దుకాణాల ముందు పడుకున్నారు.

● ఇతర ప్రాంతాలకు వెళ్లే కొందరు ప్రయాణికులు చలికి వణుకుతూ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కూర్చోగా మరికొందరు పడుకొని కనిపించారు.

● నీలగిరి పట్టణానికి పది నుంచి 25 కిలోమీటర్లు దూరం నుంచి రైతులు కూరగాయలు, ఆకుకూరలు తీసుకొస్తూ కనిపించారు. కొందరు ద్విచక్రవాహనాల మీద, మరికొందరు ఆటోల ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు.

● బీట్‌ మార్కెట్‌ సమీపంలోని రైతు బజార్‌, ప్రకాశం బజారు వద్ద ఉదయం 10 గంటల వరకు ఎక్కువగా రైతులే కూరగాయలు విక్రయించి తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు.

● ఎంత చలి ఉన్నా వివిధ వృత్తుల కార్మికులు, ప్రజలు, రైతులు తమ రోజు వారి పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement