లారీ ఢీకొనడంతో విద్యార్థి దుర్మరణం
నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద శుక్రవారం ఆగి ఉన్న టీవీఎస్‌ను లారీ ఢీకొనడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం.. స్వెటర్లు కొనేందుకు శ్రీనగర్‌కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి చిట్లపల్లి గణేష్ (18) తన అమ్మమ్మ సిలువేరు పద్మతో కలిసి టీవీఎస్‌పై వచ్చి క్లాక్‌టవర్ వద్ద ఉన్న దుకాణం ఎదుట ఆగాడు. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ మిర్యాలగూడ వైపు వెళ్తూ.. ఆగి ఉన్న టీవీఎస్‌ను ఢీకొనడంతో పద్మ కొద్ది దూరంలో ఎగిరి పడగా, గణేష్ లారీ టైరు కింద పడ్డాడు. దీంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో లారీని డ్రైవర్ నిలిపాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు లారీ డ్రైవర్‌ను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నకిరేకల్ మండలం నర్సింహాపురం గ్రామానికి చెందిన గణేష్ నల్లగొండలోని తన అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. తండ్రి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment