రైతులు ఆర్థిక స్వావలంబన సాధించాలి
భూదాన్‌పోచంపల్లి: పాల ఉత్పత్తులను పెంచుకుని రైతులు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అఫీసర్ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో భూదాన్‌పోచంపల్లి మండలంలోని కనుముకుల, దంతూర్, వంకమామిడి గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 303 పశువులకు గర్భకోశ చికిత్స చేసి నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అనంతరం దూడల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పాడి రైతులకు మందులు, పాల క్యాన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో సబ్సిడీ కింద నూతన సాంకేతిక విధానంలో కృత్రిమ గర్భధారణ చేయించడం వల్ల అధిక పాల దిగుబడి ఇచ్చే మేలుజాతి ఆడదూడలు పుట్టించే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ సమయంలో మేలుజాతి పశుసంపదను అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో వైశువైద్యాధికారులు అశోక్, శ్రీనివాస్, రఘు, వెంకటేశ్, రాంచంద్రారెడ్డి, పృథ్వీ, వెటర్నరీ అసిస్టెంట్లు రమేశ్, జమీల్, మహేశ్, లింగస్వామి, రాజు, బాలనర్సింహ, వేణుగోపాల్, శేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment