కలగానే ‘అగ్రి’ కళాశాల!
కంపాసాగర్‌లో వ్యవసాయ డిగ్రీ కళాశాల హుళక్కేనా..
ఇక్కడి నుంచి
తరలించకుండా చూడాలి
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కంపాసాగర్‌లో వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు
చేయాలని నిర్ణయించింది. కానీ, ప్రభుత్వం మారడంతో కార్యరూపం దాల్చలేదు. అన్ని వసతులు ఉన్న ఈ ప్రాంతంలోనే కళాశాలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యవసాయ కళాశాలను కంపాసాగర్‌లోనే ఏర్పాటు చేసేలా నల్లగొండ ఎంపీ, సాగర్ ఎమ్మెల్యే చొరవ చూపాలి.
– ఇస్లావత్ రాంచందర్ నాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్, సత్యంపాడు తండా
త్రిపురారం: నాగార్జునసాగర్ నిమోజక వర్గంలోని త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగలనుంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంపాసాగర్‌లో వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని సిద్ధమైంది. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తరువాత కూడా వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఇదే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర నీటిపారుదల, పౌరరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో ఈ కళాశాలను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కంపాసాగర్‌లో ఏర్పాటు చేస్తామన్న వ్యవసాయ డిగ్రీ కళాశాలను ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనుకూల వాతావరణం ఉన్నా..
వ్యవయసా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు త్రిపురారం మండలం అనుకూలాంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం మరోచోట ఏర్పాటు చేయనుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కంపాసాగర్ గ్రామం 167వ జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉండడంతోపాటుగా ఇదే ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇలాంటి ప్రాంతంలోనే వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులతోపాటు అన్నివర్గాల వారికి రవాణాపరంగా సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు.
ఫ అన్ని వసతులున్నా ఏర్పాటు
చేయని ప్రభుత్వం
ఫ మొదట ఇక్కడే నిర్మించాలని యోచన
ఫ ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు తరలింపు
ఫ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment