‘బ్రాహ్మణవెల్లెంల’ పనులు ప్రారంభించాలి
నల్లగొండ: బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు ఎడమ కాలువ పనులను ఈనెల 25లోగా ప్రారంభించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో బ్రాహ్మణవెల్లెంల ఎడమ కాలువ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం కింద కాలువల నిర్మాణానికి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకించి బ్రాహ్మణవెల్లెంల లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెట్టాలన్నారు. భూములో కోల్పోయిన రైతుల నుంచి భూములకు సంబంధించిన పాసు బుక్కులు, ఇతర ధ్రువపత్రాలు సేకరించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు డిప్యూటీ ఇంజనీర్ విఠలేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment