మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులదే
చింతపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కల సంరక్షణకు సంబంధిత అధికారులదేనని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వన నర్సరీని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీలో కూలీలకు పని కల్పించేందుకు పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధిలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట దేవరకొండ క్లస్టర్ ఏపీడీ యామిని, ఎంపీడీఓ సుజాత, ఏపీఓ శౌరిరెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment