త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 125, 126 సర్వే నంబర్లలో సుమారు 305 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఈ భూమిలో ఇప్పటికే 2007లో పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలను ఏర్పాటు చేశారు. 25 ఎరాల భూమి లెదర్ డెవలప్‌మెంట్ ఇండ్రస్టీయల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. అలాగే బాబుసాయిపేట, కంపాసాగర్, త్రిపురారం గ్రామాలతోపాటు, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ అవసరాలకు కొంత భూమిని కేటాయించారు. అదేవిధంగా 2005లో మరికొన్ని ఎకరాల్లో వ్యవపాయ పరిశోధన స్థానం ఏర్పాటైంది. ఇందులోనే 50 ఎకరాల భూమిని కేవీకే కంపాసాగర్‌కు కేటాయించారు. ప్రస్తుతం సుమారు 230 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. అయితే వ్యవసాయ డిగ్రీ కళాశాలకు సుమారు 75 ఎకరాల భూమి అవసరమున్నప్పటికీ ఇక్కడ వంద ఎకరాల భూమిని వినియోగించుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే ప్రస్తుతం ఇక్కడ కేవీకే, వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉండడంతో వ్యవసాయ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటైతే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండనుంది. అన్ని వసతులు ఉన్న ప్రాంతాన్ని కాదని రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవసాయ డిగ్రీ కళాశాలను ఇప్పుడు సూర్యాపేట జిల్లా మఠంపల్లికి తరలిస్తున్నారనే విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకుని వ్యవసాయ డిగ్రీ కళాశాలను కంపాసాగర్‌లోనే ఏర్పాటు చేయాలని నియోజక వర్గ ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment