నల్లగొండ: వచ్చే సంక్రాంతి పండుగ నాటికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న వారితోపాటు పిల్లల పేర్లు కార్డుల్లో నమోదుకాని వారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సంక్రాంతి వరకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో ఇప్పటికే అర్జీ పెట్టుకుని ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
గతంలో కొందరికే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ఒకసారి ఇచ్చినప్పటికీ చాలామందికి కార్డులు రాలేదు. ఈ క్రమంలో పెళ్లయిన వారు కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే కార్డు రాకపోగా పాత కార్డులో ఉన్న పేర్లు కూడా తొలగిపోయి రేషన్ సరకులకు దూరమయ్యారు. తర్వాత దరఖాస్తులు తీసుకునేందుకు ఆన్‌లైన్ ఆప్షన్ బంద్ కావడంతో దరఖాస్తులు చేసుకోలేకపోయారు. దీంతో చాలా పెళ్లయిన జంటలు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అప్పట్లో పెళ్లయిన వారు తమ పిల్లల పేర్లను కార్డులో ఎక్కించేందుకు అవకాశం లేక నేటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు.
ప్రజాపాలనలో వేలాదిగా దరఖాస్తులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన కార్యక్రమం కింద రేషన్‌కార్డులు, ఇతర పథకాలకు ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆ సందర్భంలో జిల్లా వ్యాప్తంగా 50 వేల మందికిపైగా కొత్త రేషన్ కార్డులతోపాటు తమ పిల్లల పేర్లను చేర్పించేందుకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం సంక్రాంతి వరకు రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో దరఖాస్తుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫ ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం
ఫ దరఖాస్తుదారుల్లో చిగురిస్తున్న ఆశలు
ఫ ప్రజా పాలనలో అందిన అర్జీలు
50 వేలకుపైనే..
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వివరాలు
మొత్తం కార్డులు 4,66,061
ఆహార భద్రత 4,35,880
అంత్యోదయ 30,118
అన్నపూర్ణ 63
యూనిట్ల సంఖ్య 13,92,829
Comments
Please login to add a commentAdd a comment