పక్కా ఆధారాలతోనే కేటీఆర్‌పై కేసు నమోదు
చౌటుప్పల్ : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి నిధుల కేటాయింపులు చేశారని, పక్కాగా ఆధారాలు ఉన్నందునే మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి అనుమతులు సైతం తీసుకోకుండానే తమ ఇష్టానుసారంగా కేటాయింపులు చేశారని ఆరోపించారు. వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు కూడా బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులకు ఓపిక లేకుండానే ఉభయ సభల్లో నానా యాగి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సభల్లో రైతుభరోసా, ఆర్‌వోఆర్ వంటి కీలమైన బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. తప్పు చేసిన వ్యక్తులే అసెంబ్లీని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. చిన్నచిన్న గ్రామ పంచాయతీల్లోనే నిధులను కేటాయించే క్రమంలో నిబంధనలు పాటిస్తారని, అలాంటి కోట్లాది రూపాయలను కేటాయించే క్రమంలో నిబంధనలను పాటించకుంటే ఎలా అని ప్రశ్నించారు.
అభివృద్ధిలో వెనుకబడిన యాదాద్రి జిల్లా..
హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ యాదాద్రిభువనగిరి జిల్లా అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. జిల్లాలోని సమస్యల పరిష్కారానికి జనసమితి శ్రేణులు కృషి చేయాలన్నారు. టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, నాయకులు లక్ష్మారెడ్డి, పన్నాల గోపాల్‌రెడ్డి, గంగసాని శ్రీనివాస్‌రెడ్డి, నకిరేకంటి అశోక్, అంజనేయచారి, మందాల బాలకృష్ణారెడ్డి, మల్గ యాదయ్య, బలిక నర్సింహ, జమ్మి గిరిబాబు, కొత్తపెల్లి గోవర్ధన్, గడ్డం యాదగిరి, అశోక్‌చారి, దయానందం, కూన యాదయ్య పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ కోదండరాం
Comments
Please login to add a commentAdd a comment