విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి
నల్లగొండ: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇళ్లు అందజేయాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ డిమాండ్ చేశారు. ఈ ఐదు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం 3వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా కో కన్వీనర్లు వెంకన్న, మహేశ్వర చారి, గిరి ఎల్లయ్య, కృష్ణయ్య యాదవ్, వినోద్, సురేష్, సుధాకర్, పరమేష్, మహేష్, సైదులు, రవి, వెంకటేష్, రమేష్, నరేశ్ పాల్గొన్నారు.
చదువు మానేసినవారికి ఓపెన్ స్కూల్ ఓ వరం
నల్లగొండ రూరల్ : చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్స్ ఒక వరం లాంటిదని రాష్ట్ర ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అరుణశ్రీ, ఉమ్మడిజిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ కల్లూరి సత్తమ్మ అన్నారు. నల్లగొండలోని బాలికల ఇంటర్మీడియట్ కళాశాల, డైట్ ప్రభుత్వ పాఠశాలలను ఆదివారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసినవారు టెన్త్, ఇంటర్ చదవచ్చని తెలిపారు. అభ్యాసకులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
క్రీడాకారుడికి కలెక్టర్ అభినందన
నల్లగొండ టూటౌన్ : జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సీఎం కప్ పోటీల్లో పవర్ లిఫ్టింగ్‌లో బాలుర జూనియర్ విభాగంలో 105 కిలోల కేటగిరీలో రాష్ట్ర స్థాయికి ఎంపికై న దాసరి జయశీల్‌కుమార్ ఆదివారం ఆమె తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి నర్సిరెడ్డి, చీఫ్ సెలెక్టర్ అష్రఫ్, కలెక్టర్ సీసీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment