పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం
నల్లగొండ టూటౌన్ : ఎరుకల కులంలోని పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తామని ఎరుకల ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిమ్మల వెంకన్న, చర్లపల్లి వెంకటయ్య అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఎరుకల ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నిమ్మల వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా చర్లపల్లి వెంకటయ్య, కోశాధికారిగా సుల్తాన్ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మొగిలి మల్లయ్య, వెలుగు నాగార్జున, రుద్రాక్షి భగత్, సుల్తాన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment