అమిత్‌షా క్షమాపణ చెప్పాలి
నల్లగొండ : పార్లమెంట్‌లో అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని మంతి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అంబేద్కర్ అందరివాడని, బడుగు బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశాడన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలు, అణగారిన వర్గాలపై దాడులు పెరిగాయన్నారు. అమిత్‌షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, నాయకులు నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment