పద్యనాటక పోటీల్లో నాలుగు అవార్డులు
మిర్యాలగూడ : శివానీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పద్యనాటక పోటీల్లో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ప్రదర్శించిన రావణ నాటకానికి నాలుగు అవార్డు దక్కాయి. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు బోయినపల్లి భుజంగరావు, పులి కృష్ణమూర్తిశర్మ మాట్లాడుతూ రావణ నాటకానికి నాలుగు బహుమతులు, జ్యూరీ అవార్డు లభించినట్లు తెలిపారు. ఉత్తమ నటుడిగా బోయినపల్లి భుజంగరావు, ఉత్తమ సహాయ నటుడిగా పుల్లాభట్ల వెంకటలక్ష్మీనారాయణశర్మ, ఉత్తమ సంగీతం సురభి కొండలరావు, వ్యక్తిగత ఉత్తమ జ్యూరీగా కంబాల శ్రీనివాస్, ఉత్తమ జ్యూరీ నాటకంగా రావణకు బహుమతులు వచ్చినట్లు తెలిపారు. నాటిక సమాజాల సమాఖ్య వ్యవస్థాపకుడు తడకమళ్ల రామచందర్‌రావు, అధ్యక్షుడు ఆకుల సదానందం, పాండవుల హరిప్రసాద్, పరమేశం చేతులమీదుగా అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment