రైతుకు అండగా నిలిచిన వైఎస్సార్
యాదగిరిగుట్ట: రైతు సంక్షేమానికి నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఆదివారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు – 2024 నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఒకప్పుడు సాగు అంటే సంతోషంగా ఉండేదని, ఈ రోజు వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్తోందన్నారు. కొన్ని ప్రభుత్వాలు రైతులను విస్మరించి, కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో రైతాంగం ఆగమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అందుకే 2004లో దేశంలో ఎక్కడ లేని విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించారన్నారు. రైతులకు అండగా నిలవాలని భావించి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మించింది వైఎస్సార్ అని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో 25లక్షల మందికి రూ.2లక్షల రుణమాఫీ చేశామన్నారు. వచ్చే సంక్రాంతికి రూ.7,500 రైతు భరోసాను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా తరిమేందుకు ఎస్‌ఎల్‌బీసీ, మూసీని శుద్ధీకరణ చేసేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ నుంచి బస్వాపూర్, గంధమల్ల ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.
2004లోనే రైతులకు
ఉచిత విద్యుత్ ఇచ్చారు
సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాం
ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదగిరిగుట్టలో ఆకట్టుకున్న
గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు
Comments
Please login to add a commentAdd a comment