ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే గుర్తింపు
రామగిరి(నల్లగొండ) : నాయకులుగా ఎన్నికై న వారు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే గుర్తింపు వస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నల్లగొండలోని బండారు గార్డెన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుత్తా మాట్లాడుతూ వైశ్యులు ప్రేమ జాలి గుణం కలవారని, వారికి దైవభక్తితో పాటు సహాయం చేసే గుణం ఉంటుందన్నారు. పట్టణంలో ఆర్య సంఘ భవన నిర్మాణానికి ఆర్యవైశ్య నాయకులు అడిగిన ఎకరం స్థలాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత సహకారంతో ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం కూడా పేద ఆర్యవైశ్యులను ఆదుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ ఎన్నికై న సభ్యులు సంఘ పటిష్టతతో పాటు ఆర్యవైశ్య పేదలకు సహకార అందించడానికి పనిచేయాలన్నారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు తెలుకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత, ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలక్ష్మి, మాజీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, నూతన కార్యదర్శి లక్ష్మిశెట్టి శ్రీనివాస్, అదనపు కార్యదర్శి నాల్ల వెంకటేశ్వర్లు, కోశాధికారి జయిని రాములు, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేశం, వీరెల్లి కృష్ణయ్య, తేలుకుంట్ల జానయ్య, కాసం శేఖర్, బండారు కుశలయ్య, రేపాల భద్రాద్రి, రాములు, సోమ శ్రీనివాస్, సోమ దీప్తి, మురారిశెట్టి నందిని తదితరులు పాల్గొన్నారు.
ఫ శాసనమండలి చైర్మన్
గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఫ ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన
కమిటీ ప్రమాణ స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment