నల్లగొండ టౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు అవమానకరమని, వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం నల్లగొండలోని డీఈఓ ఆఫీస్ వద్దగల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పదవిలో ఉండి అంబేద్కర్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి అమిత్‌షాను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్, సీపీఎం, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఇందుర్ సాగర్, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, సయ్యద్ హాషం, పాలడుగు నాగార్జున, సీహెచ్ లక్ష్మీనారాయణ, పి.ప్రభావతి, ఎండీ. సలీం, దండంపల్లి సత్తయ్య, నల్పరాజు సైదులు, మల్ల మహేష్, కొండా అనురాధ, గాదె నరసింహ, దండెంపల్లి సరోజ, కోట్ల అశోక్‌రెడ్డి, గంజి నాగరాజు, ఊట్కూరు మధుసూదన్‌రెడ్డి, కొండా వెంకన్న, సత్యనారాయణ, బొల్లు రవీందర్, అరుణకుమారి, పాకలింగయ్య, పరిపూర్ణాచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment