మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు
నల్లగొండ: జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరంలో రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలు, కులగణన, రీజినల్ రింగ్ రోడ్డు, రైతు రుణమాఫీ, సన్న ధాన్యానికి బోనస్‌తోపాటు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా పాడిపంటలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
మిగిలిన సీట్లకు కౌన్సిలింగ్
నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో డీఈఈ సెట్–2024లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రధానాచార్యులు కానుగు నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకు సాధించి ఫేజ్–1, ఫేజ్–2లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకుని సీటు రాని అభ్యర్థులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో మిగిలిపోయిన, రిపోర్టు చేయని సీట్లలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ కోసం జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. మెరిట్, రోస్టర్ ప్రకారం జనవరి 9న సీట్లు కేటాయిస్తారని, ప్రీ పేమెంట్, అడ్మిషన్ కేటాయింపు 9 నుంచి 13వ తేదీ వరకు జరుగుతుందని, కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడానికి జనవరి 16వ తేదీ గడువు అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment