అన్నింటికీ మూలాధారం సైన్స్
నల్లగొండ : ప్రపంచంలో అన్నింటికీ మూలాధారం సైన్స్ అని, సైన్స్ లేకుండా రోజు గడవదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని డాన్ బోస్కో పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఆమె.. ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జీవనశైలిని సైతం మార్చే శక్తి సైన్స్‌కు ఉందన్నారు. ప్రపంచంలో ప్రతి అంశానికి సైన్స్, గణితం పునాది వంటివన్నారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులు, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ సైన్స్‌తోనే అన్నీ అభివృద్ధి చెందుతున్నాయన్నారు. విద్యార్థుల మదిలో సైన్స్ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. ‘నా మతం సైన్స్– నేను సైన్స్‌ని నమ్ముతాను’ అని సీవీ రామన్ చెప్పిన కొటేషన్‌ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉపాధ్యాయులంతా సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి డీఈఓ బి.భిక్షపతి స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా బాలభవన్ ఆధ్వర్యంలో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, లక్ష్మయ్య, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, డాన్ బోస్కో స్కూల్ ప్రిన్సిపాల్ బాలశౌరి, తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ నల్లగొండలో సైన్స్ ఫెయిర్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment