ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
చౌటుప్పల్: ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. బుధవారం సాయంత్రం చౌటుప్పల్‌లోని ఓ హోటల్ వద్ద ఆగి కార్యకర్తలతో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.1800 కోట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. కాల్వలు పూర్తి చేసి ఏదుళ్ల నుంచి నక్కలగండి ప్రాజెక్టు ద్వారా నీరందిస్తే ఫ్లోరోసిస్ ప్రాంతాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. దేవరకొండ, మునుగోడు ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తు ఆ పార్టీ నాయకులపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో సీపీఐ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట పార్టీ మండల కార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, పగిళ్ల మోహన్‌రెడ్డి, ఉడత రామలింగం, టంగుటూరి రాములు, రెహమాన్, రొండి నరసింహా ఉన్నారు.
ఘనంగా ఫలహారపు బండ్ల ఊరేగింపు
చింతపల్లి: మండలంలోని హేమంతాలపల్లిలో గల పెరుమాళ్ల దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలహారపు(ఎద్దుల) బండ్లు ఊరేగించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు మాడ్గుల, దేవరకొండ నుంచి ప్రజలు వచ్చారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment