విచ్చలవిడిగా చైనా మాంజా విక్రయాలు
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణంలో విచ్చలవిడిగా చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నాయి. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ కొందరు వ్యాపారులు బహిరంగంగానే దానిని విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు నామమాత్రంగా తనిఖీ చేసి వదిలేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే భువనగిరి పట్టణంలో చైనా మాంజా 10 మందికి పైగా గాయపడి ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు వైద్యులు తెలిపారు. గాలిపటాలు సైతం అధిక ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆర్బీనగర్, బహేర్‌పేటలో గాలిపటాలు ఎగురవేసే క్రమంలో కొందరు గొడవపడి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. వారికి పోలీసులు సర్దిజెప్పి పంపించారు.
ఐదుగురిపై కేసు నమోదు
భువనగిరి పట్టణంలోని సమ్మద్ చౌరస్తా వద్ద చైనా మాంజా విక్రయిస్తున్న ఐదుగురిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. 18 రకాల మాంజాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మాంజా విక్రయదారుల మధ్య వాగ్వాదం జరిగింది. పట్టణంలో మాంజా అమ్మే అందరిని పట్టుకోవాలని విక్రయదారులు పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో పోలాసులు వారిని పోలీస్ స్టేష్‌కు తరలించారు.
ఒక్కరోజే 10 మందికి పైగా గాయాలు
Comments
Please login to add a commentAdd a comment