హామీల సాధనకే మహాధర్నా
రామగిరి(నల్లగొండ) : కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను సాధించేందుకే రైతు మహాధర్నా తలపెట్టామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సూర్యాపేట, యాదాద్రి జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతుల విషయంలో కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఈ నెల 21న నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్‌లో రైతు మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాను ఎగ్గొట్టిందని, 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, పంటలకు యూరియా కొరత సృష్టించిందని మండిపడ్డారు. ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు భువనగిరిలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ధ్వజమెత్తారు. అధికారులు సైతం నిస్పక్షపాతంగా పనిచేయాలన్నారు. ఈ ధర్నాకు ఈ ధర్నాకు మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ నేతలు, శ్రేణులు, రైతులు తరలిరావాలని కోరారు. అనంతరం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను కలిసి మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, పార్టీ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
Comments
Please login to add a commentAdd a comment