వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకోవాలి
మిర్యాలగూడ అర్బన్: వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని డీఎంహెచ్‌ఓ పి.శ్రీనివాస్ అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఐఎంఏ బిల్డింగ్‌లో ఎంఓ, ఎంఎల్‌హెచ్‌పీ, ఆల్ ప్రోగ్రాం డివిజన్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బంది వారికి నిర్దేశించిన లక్ష్యాలను నూటికి నూరు శాతం పూర్తిచేయాలన్నారు. ప్రతిఒక్కరూ విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం డివిజన్‌లోని అన్ని పీహెచ్‌సీల్లో ల్యాబ్ ఎక్యూప్‌మెంట్, సర్జికల్స్ అవసరాలకు రూ.5.50 లక్షల నిధులను విడుదల చేసిన సబ్ కలెక్టర్‌కు వైద్య సిబ్బంది ఆయన కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ పరిదిలోని వైద్య సిబ్బంది కళ్యాణ్‌చక్రవర్తి, కృష్ణకుమారి, వేణుగోపాల్‌రెడ్డి, రవి, అరుంధతి, గీతావాణి, శంకర్, నాగేశ్వర్‌రావు, ప్రభాకర్, శ్రీనివాస స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment