నవోదయ పరీక్షకు 76.69 శాతం హాజరు
పెద్దవూర : చలకుర్తి క్యాంపులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకుగాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76.69 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ ఆర్.నాగభూషణం తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 5, సూర్యాపేటలో 9, నల్లగొండ జిల్లాలో 13 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో 2,329 మందికి గాను 1,803 మంది(77.42శాతం), సూర్యాపేట జిల్లాలో 1,525 మందికి గాను 1,199 మంది(78.62శాతం), యాదాద్రి భువనగిరి జిల్లాలో 693 మందికి గాను 485 మంది(69.99శాతం) విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. మొత్తం 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 4547 మంది దరఖాస్తు చేసుకోగా.. 3487 మంది హాజరయ్యారని.. 1060 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment